Breaking News

పాక్‌లో మరో హత్య: జమీయత్‌ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం

Published on Mon, 03/17/2025 - 10:19

క్వెట్టా: పాకిస్తాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. జమీయత్‌ ఉలేమా ఈ ఇస్లాం(జేయూఐ)(Jamiat Ulema-e-Islam) సీనియర్‌ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన క్వెట్టాలోని ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.  

దుండగులు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌(Mufti Abdul Baqi Noorzai)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో  ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్‌ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అ‍క్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి.

ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌(Army convoy)పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్‌లోని మష్ఫాక్ టన్నెల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: త్వరలో ట్రంప్‌-పుతిన్‌ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)