Breaking News

ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు

Published on Tue, 12/30/2025 - 19:32

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.

బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్‌క్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్‌తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.    

ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో  దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్‌ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్‌ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.

ఖలీదా జియా ప్రస్థానం
1945లో అవిభక్త భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్‌తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు)  జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా  సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది.  ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. ‍కాగా బీఎన్పీ పార్టీ భారత్‌కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)