Breaking News

‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 06/25/2025 - 08:05

వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిందని, ఇది తనకెంతో సంతృప్తినిచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ముందు, ఇరాన్‌లోని అన్ని అణు కేంద్రాలను ధ్వంసం చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా ట్రంప్‌ అభివర్ణించారు. ఆయన తన ట్రూత్ సోషల్‌లో ఇజ్రాయెల్ - ఇరాన్ రెండు దేశాలు వివాదం ముగియాలని ఒకేవిధంగా కోరుకున్నాయని పేర్కొన్నారు.

జూన్ 13న ఇజ్రాయెల్‌తో జతకట్టిన అమెరికా ఇరానియన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలపై సమన్వయంతో  కూడిన దాడులు చేసింది. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. అంతకుముందు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌.. ఖతార్‌తో పాటు ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది.  అనంతర పరిణామాల మధ్య ఇరు దేశాలు తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి.

ఈ ప్రకటన దరిమిలా ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్‌) టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న ఇరానియన్ రాడార్ వ్యవస్థపై పరిమిత దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్‌పై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపధ్యంలో అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్- ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య సంభాషణ జరిగిందని పేర్కొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో దాని పాత్రను కొనసాగిస్తే ఇజ్రాయెల్ యుద్ధ విరమణను గౌరవిస్తుందని తెలిపింది. 

ఇది కూడా చదవండి: Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)