Breaking News

గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి

Published on Thu, 08/29/2024 - 13:26

గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్‌ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. 

పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉ‍న్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్‌ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్‌ మహ్మద్ జాబర్ అలియాస్‌ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్‌ చేసినట్టు తెలిపింది.

అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో​ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్‌ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్‌ దాడుల్లో 10 మంది ఫైటర్లు​ మృతి చెందినట్లు హమాస్‌ మలిటెంట్‌ సంస్థ పేర్కొంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)