Breaking News

ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత

Published on Sat, 10/26/2024 - 12:50

టెహ్రాన్‌:తమపై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రయోగించిన మిసైల్స్‌ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. 

ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్‌, ఇరాక్‌, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

అక్టోబర్ 1న హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా  ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్‌ చేసిన దాడులపై ఇరాన్‌ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఇలామ్‌, ఖుజెస్తాన్‌, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్‌ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో  పేర్కొంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)