Breaking News

లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులు

Published on Sun, 06/14/2026 - 19:11

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్‌ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు.

ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది

ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)