Breaking News

300 మంది మరణించాక.. ఇజ్రాయెల్, సిరియా కాల్పుల విరమణ

Published on Sat, 07/19/2025 - 10:00

డమాస్కస్: సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి  కొనసాగిన మారణహోమం దరిమిలా ఇజ్రాయెల్- సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.

సిరియాలోని దక్షిణ స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన హింస అనంతరం  ఇజ్రాయెల్- సిరియాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో మహిళలు, పిల్లలు, వైద్య సిబ్బందితో సహా మొత్తం 321 మంది మరణించారని మానవ హక్కుల పరిశీలకులు తెలిపారు. సిరియా అధ్యక్ష కార్యాలయం  కాల్పుల విరమణను ప్రకటించింది. ఇందుకోసం దక్షిణాన ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని మోహరించినట్లు తెలిపింది. పరిస్థితులు తీవ్రతరం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా సమన్వయంతో కూడిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

దక్షిణాన సిరియా సైనిక మోహరింపులను ఇజ్రాయెల్‌ వ్యతిరేకించినప్పటికీ, 48 గంటల పాటు స్వీడాకు పరిమిత సిరియన్ అంతర్గత భద్రతా దళాల ప్రవేశాన్ని అనుమతిస్తామని తెలిపింది. సిరియా కొత్త నాయకత్వం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలోని డ్రూజ్ కమ్యూనిటీకి ముప్పు కలిగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. స్వీడాపై దాడులను కొనసాగించింది. ఇది గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సూచిస్తుంది. స్వీడా ప్రావిన్స్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక వార్తా సంస్థ స్వీడా24 ప్రతినిధి ర్యాన్ మారౌఫ్ తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)