Breaking News

ఇరాన్‌ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్‌ వెల్లడి

Published on Sat, 06/21/2025 - 10:03

జెరూసలేం: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం  ఇరుదేశాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరింది. మరోవైపు అణు చర్చలను పునరుద్ధరించేందుకు,  ఘర్షణలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు యూరోపియన్ దౌత్యవేత్తలు జెనీవాలో సమావేశమైన తరుణంలోనూ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.

ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. టెహ్రాన్ హైఫా,  బీర్షెబా వద్ద భీకరంగా క్షిపణుల దాడి జరిగిందని, దీనిలో ఇరానియన్ కీలక డ్రోన్ కమాండర్ హతమయ్యాడని పేర్కొంది. మరోవైపు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ.. ఇరాన్‌లో  ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి  ఇప్పటివరకూ 657 మంది మృతిచెందగా, రెండువేల మందికి పైగా జనం గాయపడ్డారని తెలిపింది. కాగా జెనీవాలో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈయూ విదేశాంగ విధాన చీఫ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ మంత్రులతో చర్చలు జరిపారు.

యూరోపియన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ‘ఇరాన్.. యూరప్‌తో మాట్లాడటానికి ఇష్టపడటం  లేదని, వారు తమతో మాట్లాడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ తీవ్రతను తగ్గించడానికి లేదా అమెరికా జోక్యాన్ని  అనుమతించేందుకు రెండు వారాల  గడువు మాత్రమే ఉందని ట్రంప్.. టెహ్రాన్‌(ఇరాన్‌)ను హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ సుదీర్ఘ ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్‌ సుప్రీం 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)