భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
ఇజ్రాయెల్ భారీ అటాక్.. 50 ఫైటర్ జెట్స్‌తో ధ్వంసం
Published on Fri, 03/06/2026 - 18:06
ఇజ్రాయెల్ మరో భారీ అటాక్ చేసింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న అత్యంత రహస్యమైన బంకర్‌ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కోసం 50కి ఫైగా ఫైటర్ జెట్ వాడినట్లు తెలిపింది. అయితే ఈ బంకర్ మాజీ సుప్రీం ఆయుతుల్లా ఖమేనీ తలదాచుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆయన మృతితో ప్రస్తుతం ఇతర అధికారులు ఈ బంకర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రహస్య స్థావరం నుంచే ఇరాన్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ బంకర్‌లో ప్రవేశానికి అనేక వీధుల గుండా మార్గాలున్నాయని లోపల ఎన్నో గదులున్నాయంది. దీనిని గుర్తించడానికి ప్రత్యేక నిఘా పెట్టామని పక్కా సమాచారంతోనే దానిపై దాడి చేసినట్లు తెలిపింది. తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది.
కాగా ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ బంకర్‌నే ప్రధానంగా వాడుతున్నారని సమాచారం.. ఇప్పుడు దానిని ధ్వంసం చేయడంతో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పైకి పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి.
🎥 WATCH: ~50 Israeli Air Force fighter jets dismantled Ali Khamenei’s underground military bunker beneath the Iranian regime’s leadership compound in Tehran. pic.twitter.com/Nw0tvvQMRX
— Israel Defense Forces (@IDF) March 6, 2026
Tags : 1