Breaking News

హమాస్‌కు ఇక నరకమే: నెతన్యాహు వార్నింగ్‌

Published on Mon, 02/17/2025 - 07:22

టెల్‌అవీవ్‌:ఇజ్రాయెల్‌,హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హమాస్‌పై చేసిన వ్యాఖ్యలు గాజాలో పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాయి. బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయకపోతే హమాస్‌ను లేకుండా చేస్తామని,హమాస్‌ ఉగ్రవాదులకు నరకం గేట్లు తెరుస్తామని నెతన్యాహు తాజాగా వార్నింగ్‌​ ఇచ్చారు.‍్హ

హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఇజ్రాయెల్‌ పర్యటనకు వచ్చిన అమెరికా స్టేట్‌ సెక్రటరీ మార్కో రుబియోతో కలిసి ఆదివారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.

గాజాలో హమాస్‌ ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు దాని ప్రభుత్వాన్ని లేకుండా చేస్తామని రుబియో చెప్పారు. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న తమ వారిని సురక్షితంగా తీసుకువస్తామని నెతన్యాహు అన్నారు. అయితే తాజాగా రఫాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్‌ ప్రతినిధులు చనిపోయారు. దీనిపై హమాస్‌ ఆగ్రహంగా ఉంది. 

రెండో దశ కాల్పుల విరమణకుగాను మళ్లీ చర్చలు జరగాలని, కాల్పుల విరమణతో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు వెళ్లిపోవాలని హమాస్‌ అంటోంది.ఇప్పటికే కుదిరిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ ఇప్పటికే పలువురు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)