Breaking News

అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్‌ ప్రధాని

Published on Tue, 05/28/2024 - 08:08

టెల్‌ అవీవ్‌: రఫాపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.

‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.

మరోవైపు హమాస్‌ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. 

ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

మిత్రదేశాల ఖండన
ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు. 

 

మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)