Breaking News

హమాస్‌తో డీల్‌.. నెతన్యాహు వ్యాఖ్యల అర్థమేంటి?

Published on Thu, 01/16/2025 - 09:14

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్‌-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్‌ తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.

ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌థానీ ప్రకటించారు.

ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ ‍క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)