Breaking News

లెబనాన్‌పై దాడుల నియంత్రణకు అమెరికా దౌత్యం

Published on Tue, 07/30/2024 - 09:54

ఇంతవరకూ పాలస్తానాలోని గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరుగుతున్న యుధ్దం ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. ఇది తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు అమెరికా తన ప్రయత్నాలను ప్రారంభించింది.

ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై జరిగిన రాకెట్‌ దాడిలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్‌- లెబనాన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనిని నిరోధించేందుకు యునైటెడ్ స్టేట్స్ రంగంలోకి దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బీరుట్‌ లేదా ఇతర లెబనీస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించిందని రాయిటర్స్ పేర్కొంది.

అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్  తాజాగా లెబనాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతోందని, ఇది బహుశా చాలా రోజుల పాటు కొనసాగవచ్చని అన్నారు. అయితే తాము ఇజ్రాయెల్‌ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. లెబనాన్‌లోని బీరుట్‌తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ‍ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.

లెబనాన్‌ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్‌తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్‌ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను అదుపు చేసేందుకు అమెరికా, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య  దౌత్యపరమైన చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ.. లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు నడుంబిగించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)