Breaking News

లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు..!

Published on Sun, 01/04/2026 - 21:26

నిన్న-మొన్నటి వరకూ ఇరాక్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయిల్‌.. ఇప్పుడు లెబనాన్‌పై యద్ధం చేయడానికి సిద్ధమవుతుందా?,  ఇజ్రాయిల్‌  సైనిక దళాలు తమ సరిహద్దు గోడను దాటి లెబనాన్‌లోకి వెళ్లడానికి కారణం ఏమిటి?, ఇజ్రాయిల్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఒక దేశం సైనిక దళాలు.. వేరొక దేశంలోకి ప్రవేశించాయంటే కారణం లేకుండా వెళ్లవు. ఇప్పుడు ఇజ్రాయిల్‌ కూడా తమ సరిహద్దు గోడను దాటి కేవలం 150 మీటర్ల దూరంలోకి వెళ్లాయి. దక్షిణ లెబనాన్‌లోని జెజైన్‌ జిల్లాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ఇజ్రాయిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దాడులకు కూడా పాల్పడిందని స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు స్పష్టం చేయింది. 

దీనిపై లెబనాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్‌ దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయిల్‌ వైమానిక దళాలు స్పందించాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. 

నెతన్యాహూ తిరిగొచ్చిన తర్వాతే ఈ దాడులు
ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మిలటరీకి ప్రత్యేక ఆదేశాల జారీ చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ ఎటువంటి సైనిక చర్యలు ఉండొద్దని పేర్కొన్నారు. అయితే ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. ఆ దేశ సైనిక దళాలు.. లెబనాన్‌న టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)