Breaking News

Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి

Published on Fri, 06/07/2024 - 05:06

డెయిర్‌ అల్‌ బలాహ్‌(గాజా): ఇజ్రాయెల్‌ బలగాలు సెంట్రల్‌ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్‌–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్‌–సర్డి స్కూల్‌లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. 

అయితే, హమాస్‌ మిలిటెంట్లు ఈ స్కూల్‌ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్‌ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్‌–అక్సా మార్టిర్స్‌ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్‌ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)