Breaking News

గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్‌ కీలక ప్రకటన

Published on Fri, 07/31/2026 - 07:20

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో శాంతిస్థాపనే లక్షంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఇకపై హమాస్‌ చేతిలో ఎటువంటి ఆయుధాలుండవని పూర్తి నిరాయుధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.గాజా స్ట్రీట్‌లో శాంతి స్థాపన కోసం ఏర్పాటైన బోర్ట్‌ ఆఫ్‌ పీస్‌ సాధించిన అత్యంత కీలక విజయమని పేర్కొన్నారు.

2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రమైన భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో పాటు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో చెలరేగిన ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా అంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ గాజాలో శాంతిస్థాపన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటు చేశారు.

కాగా ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపన కోసం ఒక కీలక ఒప్పందం జరిగినట్లు తన సోషల్‌ మీడియా ట్రూత్‌ వేదికగా పోస్ట్ చేశారు. "ఈ రోజు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గాజాలో శాంతి, భద్రతలు నెలకొనడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగు ఈ నిరాయుధీకరణ ప్రక్రియ జాగ్రత్తగా దశలవారీగా జరుగుతుంది " అని   పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఈ ఒప్పందంపై హమాస్ నుండి ఎలాంటి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, తమ ఆయుధాలను విడనాడే ప్రక్రియ దిశగా హమాస్ అడుగులు వేస్తోందని కైరోలోని మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపనను అక్కడి పోలీసులతో పాటు  'ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్' (ISF) చేపడుతుంది.

అయితే పాలస్తీనాలో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. గత గురువారం  గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు.  హమాస్ తన ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టాలని ఆ సంస్థను సైనికంగా నిరాయుధీకరణ చేయాలనేది ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ ఒకవేశ ఇది కార్యరూపం దాలిస్తే త్వరలోనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)