Breaking News

గాజాలో గుట్టలుగా శవాలు.. 50 మంది బందీల మృతి!

Published on Fri, 10/27/2023 - 10:41

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం 21వ రోజుకి చేరింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. హమాస్‌ను నామరూపాలు చేస్తామని, అందుకోసం గాజాను సర్వనాశనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుంది ఇజ్రాయెల్. ఇప్పటికే తమ దళాలకు గాజాపై భూతల దాడికి సిగ్నల్స్ ఇచ్చింది. 

ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది చనిపోయినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.  ఇందులో 3 వేల మంది చిన్నారులు ఉన్నట్లు హమాస్‌ ప్రకటించింది. గాజాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. శవాల గుర్తింపు కోసం బయటకు వస్తే.. ఎక్కడ ప్రాణాలు పోతాయోననే భయంతో గడుపుతున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా సజావుగా నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు. 

మరోవైపు.. ఏ బంధీలనైతే సురక్షితంగా విడిపించాలని ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తుందో.. వాళ్ల ప్రాణాల్నే బలిగొంటోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణాన్ని ఇజ్రాయెల్ మిసైల్ తాకిన ఘటనలో 50 మంది బందీలు మరణించినట్టు హమాస్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో రాతంత్రా జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. తూర్పు జెరూసెలంతో వేరేగా జరిపిన దాడుల్లో మరింత మంది అరెస్ట్ అయినట్టు ‘అల్ జజీరా’ పేర్కొంది.

ఇజ్రాయెల్-లెబనాన్-సిరియా మధ్య సీమాంతర పోరు కూడా జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తోంది. 
 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)