Breaking News

హమాస్‌ క్షీణత ఖాయం: ఇజ్రాయెల్‌

Published on Tue, 09/10/2024 - 17:35

పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య దాడులు కొనసాగున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య  కాల్పుల విరమణ, ఇజ్రాయెల్‌ బంధీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్  కీలక  వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్‌ బందీల విడుదలకు హమాస్‌తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.  

‘భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్‌తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని, బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని  ఆమోదించాలి. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ  క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. 

గతంలో మాదిరిగా గాజాలో హమాస్‌ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ  నేపథ్యంలో హమాస్ పటిష్టమైన  మిలిటరీ  వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు’’ అని అన్నారు.

ఇక.. గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్ జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక.. గతేడాది అక్టోబర్‌ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో ఇప్పటిరకదాదాపు 41 వేల మంది పాలస్తీనియలు  మృతి చెందారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)