Breaking News

భారత్‌లోని యూదులను తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్‌ ఆమోదం

Published on Wed, 11/26/2025 - 06:44

జెరూసలేం: ఈశాన్య భారతంలో ఉన్న 5,800 మంది యూదులను రాబోయే ఐదేళ్లలో ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లే ప్రతిపాదనకు ఆ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న బ్నీ మెనాషే కమ్యూనిటీ వలసలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని యూదు ఏజెన్సీ తెలిపింది. ‘2030 నాటికి 5,800 మంది కమ్యూనిటీ సభ్యులను ఇజ్రాయెల్‌కు తీసుకొస్తుంది. 2026లో 1,200 మంది ఇజ్రాయెల్‌కు రానున్నారు’అని వెల్లడించింది. 

ప్రీ ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియకు ఒక యూదు ఏజెన్సీ నాయకత్వం వహించడం ఇది మొదటిసారి. వీరు ఇజ్రాయెల్‌ చీఫ్‌ రబ్బినేట్, కన్వర్షన్‌ అథారిటీ, పాపులేషన్‌–ఇమిగ్రేషన్‌ అథారిటీతో కలిసి అర్హత ఇంటర్వ్యూలు నిర్వహించడం, అర్హత ఉన్న వారిని తీసుకెళ్లడానికి విమానాలను నిర్వహించడం, ఇజ్రాయెల్‌లో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం ఈ ఏజెన్సీనే చేస్తుంది. 

వలసదారుల విమాన ఖర్చులు, వారి మత మారి్పడి, గృహ నిర్మాణం, హిబ్రూ పాఠాలు చెప్పడంతోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించడానికి 90 మిలియన్‌ షెకెల్స్‌ బడ్జెట్‌ను అంచనా వేసింది. దీనిని ఇమ్మిగ్రేసన్, ఇంటిగ్రేషన్‌ మంత్రి ఓఫిర్‌ సోఫర్‌మంత్రి వర్గానికి సమర్పించారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం రబ్బీల ప్రతినిధి బృందం రాబోయే రోజుల్లో ఇండియాకు రానుంది. 

ఇలా వసల వెళ్లినవారికి ప్రారంభంలో వెస్ట్‌బ్యాంక్‌లో పునరావాసం కల్పించారు. ఇటీవల వారిని ఇజ్రాయెల్‌లోని నజరేత్‌కు చాలా దగ్గరగా ఉన్న అరబ్‌ నగరం నోఫ్‌ హగలిల్‌ పట్టణానికి పంపారు. రాబోయే ఐదేళ్లలో షెడ్యూల్‌ చేసిన వారిని కూడా అక్కడే స్థిరపడేలా చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో బ్నీ మెనాషే యూదుల గురించి అనేక చర్చలు జరిగాయి. 

బ్నీ మెనాషే అనేది మణిపూర్, మిజోరాంలలో ఉన్న యూదు కమ్యూనిటీ. ఇజ్రాయెల్‌ నుంచి వెళ్లిపోయిన 12 తెగలలో ఒక తెగకు చెందినవారుగా భావిస్తారు. 2005లోఎ అప్పటి చీఫ్‌ రబ్బీ వారిని ఇజ్రాయెల్‌ వారసులుగా గుర్తించి వారి ఇజ్రాయెల్‌ వలసలకు మార్గం సుగమం చేశారు. ఇప్పటికే బ్నీ మెనాõÙలో దాదాపు సగం మంది ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి ఆ దేశ పౌరులుగా స్థిరపడ్డారు.   

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)