Breaking News

మా ప్రధాని అరెస్టు వారెంట్‌ను రద్దు చేయండి

Published on Thu, 11/28/2024 - 10:41

టెల్‌ అవీవ్‌: యుద్ధ నేరాల కేసులో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును అరెస్టు చేయాలంటూ జారీ అయిన అరెస్ట్‌వారెంట్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఇజ్రాయెల్‌ ఆశ్రయించింది. తీర్పు వచ్చే వరకు ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్‌పై అరెస్టు వారెంట్లను నిలిపివేయాలని గురువారం న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్‌ కోరింది. తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువడేదాకా వారెంట్‌ అమలును నిలుపుదల చేయాలని వేడుకుంది. 

గాజా స్ట్రిప్‌లో యుద్ధం చేస్తూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణానికి కారణమవుతూ ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అందుకే నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ప్రకటించడం తెల్సిందే. హమాస్‌ సైనిక విభాగ సారథి మొహహ్మద్‌ డెయిఫ్‌పైనా ఇదే తరహాలో అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అధికార పరిధి, అరెస్టు వారెంట్ల చట్టబద్ధతను తాము సవాలు చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం పట్ల అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, ఐక్యరాజ్య సమితి ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ మిత్రదేశాలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. 

2023 అక్టోబర్‌ 8 నుంచి 2024 మే 20 వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి బెంజమిన్‌ నెతన్యాహు, యోవ్‌ గాలెంట్‌లపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ చర్యను నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్‌ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఫ్రాన్స్‌లు నెతన్యాహుకు మద్దతు పలికాయి. వారెంట్ల జారీని తప్పుబట్టాయి. మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం యూదుల పట్ల వివక్ష చూపిస్తోందని నెతన్యాహు ఆరోపించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)