Breaking News

హమాస్‌పై ఇజ్రాయెల్‌ ఆగ్రహం.. వారం రోజుల్లో..

Published on Sun, 02/23/2025 - 08:44

టెల్‌అవీవ్‌:గాజా కాల్పుల విరమణ ఒప్పం​దానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్‌ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్‌ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.

పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్‌ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్‌ అభ్యంతరం తెలిపింది.

పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్‌ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)