Breaking News

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

Published on Sun, 03/24/2024 - 07:32

బీరుట్‌: లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆదివారం(మార్చ్‌ 24) తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్‌ గ్రూపు హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్‌ మేయర్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్‌ డోమ్‌పై డ్రోన్‌లతో దాడులు జరిపినట్లు హెజ్బొల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడులకు దిగింది. లెబనాన్‌ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్‌​ తెలిపింది. ఈ రాకెట్‌లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని వెల్లడించింది.

కాగా, మార్చ్‌ 12న బల్బీక్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లోని మిలిటెంట్‌ గ్రూపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి.   

ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)