Breaking News

అది తప్పుడు ప్రచారం..‘చిన్మయ్‌’కి అండంగా ఉంటాం: ఇస్కాన్‌

Published on Fri, 11/29/2024 - 13:55

ఢాకా:బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చిన్మయ్‌ అరెస్టుతో సంబంధం లేదని తాము ప్రకటించినట్లు వస్తున్న వార్తలను ఇస్కాన్‌ తాజాగా ఖండించింది. చిన్మయ్‌ కృష్ణదాస్‌కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని  హిందువుల హక్కులను కాపాడడానికి ఇస్కాన్‌ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేసింది.

హిందువులను,వారి ప్రార్థనా స్థలాలను రక్షించాలని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్‌ కృష్ణదాస్‌కు తమ‌ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనిన ఇస్కాన్‌ తెలిపింది. చిన్మయ్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని ఇస్కాన్‌ డిమాండ్‌ చేసింది.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు కల్పిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. 

తమ సంస్థను అప్రతిష్ఠపాలు చేయడానికి ఈ ప్రచారాలు చేస్తున్నట్లుందని సంస్థ ప్రధాన కార్యదర్శి చారు చంద్రదాస్‌ తెలిపారు. కాగా,చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రవర్తన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని బాధ్యతల నుంచి అతడిని తొలగించామని ఆయన చేసే నిరసనలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చారు చంద్రదాస్ ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా అక్టోబర్‌లో చిట్టగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో  చిన్మయ్ కృష్ణదాస్‌ జాతీయజెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించాలని ఓ న్యాయవాది అక్కడి కోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది.

	చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన షేక్ హసీనా, మమతా బెనర్జీ

ఇదీ చదవండి: ‘చిన్మయ్‌’ అరెస్టుపై స్పందించిన షేక్‌హసీనా

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)