Breaking News

యూట్యూబర్‌ను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చిన తండ్రి..కోపంతో దారుణంగా

Published on Sat, 02/04/2023 - 16:31

బాగ్ధాద్‌: ఇరాక్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ టిబా అల్ అలీ దారుణ హత్యకు గురైంది. కన్నతండ్రే ఆమెను కిరాతకంగా హతమార్చాడు. డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి గొంతునులుమి అంతం చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే అవమానం భరించలేకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఏం జరిగిందంటే..?
టిబ 2017లోనే ఇళ్లు వదిలి టర్కీకి వెళ్లిపోయింది. సిరియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే జనవరిలో తన సొంత దేశం ఇరాక్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సమయంలోనే ఆమెను తండ్రి కిడ్నాప్ చేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే టిబా తన తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకుందని, స్నేహితురాలి ఇంట్లో ఆమెను కలిసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రం వాగ్వాదం చెలరేగింది. అయితే టిబాకు తండ్రి డ్రగ్స్ ఇవ్వడంతో ఆమె కాసేపటికే సృహకోల్పోయింది. అనంతరం ఆమె నిద్రలో ఉండగానే గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు  వెళ్లి లొంగిపోయాడు.
చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)