Breaking News

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర..! సీక్రెట్‌ సర్వీసెస్‌కు ముందే తెలుసా..?

Published on Wed, 07/17/2024 - 09:19

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌కు ముందే తెలుసా..? సీక్రెట్‌ సర్వీసెస్‌ ఈ విషయాన్ని ట్రంప్‌ టీమ్‌కు చెప్పిందా..? ట్రంప్‌ టీమ్‌కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.

ట్రంప్‌ను చంపడానికి ఇరాన్‌ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్‌ సర్వీసెస్‌కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్‌ టీమ్‌కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్‌ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది. 

ఇరాన్‌ కుట్రపై ఇంటెలిజెన్స్‌ సమాచారం అందగానే ట్రంప్‌ సెక్యూరిటీని సీక్రెట్‌ సర్వీసెస్‌ భారీగా పెంచినట్లు తెలిపింది.  మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు  ట్రంప్‌కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్‌ సర్వీసెస్‌ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. 

కాగా, ఈ ఏడాది నవంబర్‌ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరపున డొనాల్డ్‌ ట్రంప్‌ తలపడుతున్నారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)