Breaking News

తెరుచుకున్న ఇరాన్‌ గగనతలం.. ఢిల్లీకి మరో 290 మంది విద్యార్థులు

Published on Sat, 06/21/2025 - 07:18

న్యూఢిల్లీ: ఇరాన్‌లో యుద్ధమేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్‌ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ‘ఆపరేషన్‌ సింధు’ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత,  290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా జమ్ముకశ్మీర్‌కు చెందినవారు.  

ఇరాన్‌ తాజాగా వెయ్యిమంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్‌ మూడు విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడుల తరువాత భారతీయులను రక్షణకోసం టెహ్రాన్(ఇరాన్‌) నుండి మషద్‌కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్‌లైన్ మహాన్ నడుపుతుండగా, న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది.

‘సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని  తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తమ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది  ఉపశమనం అని జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం పేర్కొంది. గురువారం ‘ఆపరేషన్‌ సింధు’లో భాగంగా 110 మంది భారత విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిని అర్మేనియా, దోహాల మీదుగా భారత్‌ తరలించారు.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న 110 మంది విద్యార్థులు
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు