Breaking News

అణు పరీక్షలతోనే ఇరాన్‌లో భూకంపమా?

Published on Sat, 06/21/2025 - 16:21

తీవ్రత తక్కువే అయినా కూడా శక్తివంతమైన భూకంపం శుక్రవారం ఇరాన్‌ను వణికించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని.. స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభించిందని ఇరాన్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్‌ అణు పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ భూమి కంపించిందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. 

జూన్‌ 20 శుక్రవారం ఇరాన్‌ సెమ్నాన్‌ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్‌ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. 

ప్రస్తుతం ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం 9వ రోజుకి చేరింది. అణు ఒప్పందాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని ఇరాన్‌ తాజాగా ప్రకటించింది కూడా. అయితే ఆ దేశ సైన్యం నడిపించే మిస్సైల్‌ కాంప్లెక్స్‌తో పాటు సీక్రెట్‌ స్పేస్‌ సెంటర్‌ కూడా సెమ్నాన్‌ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఈ అనుమానం తెర మీదకు వచ్చింది.  

సాధారణంగా అణు పరీక్షలు నిర్వహించే క్రమంలో భూమి కంపించడం సహజమే. పేలుళ్ల ధాటికి టెక్టానిక్‌ ప్లేట్లు ఒత్తిడికి గురికావడం వల్ల భూకంపానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భూకంప శాస్త్రవేత్తలు (Seismologists).. సహజ భూకంపాలకు, అణు కార్యక్రమాల వల్ల ఏర్పడే ప్రకంపనలకు తేడాను గుర్తించగలుగుతారు. 

ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇరాన్‌ తాజా భూకంపానికి, అణు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వేతో పాటు కాంప్రిహెన్సివ్‌ న్యూక్లియర్‌ టెస్ట్‌ బ్యాన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(CTBTO) ధృవీకరించారు. మరికొందరు సిస్మాలజిస్టులు కూడా ఇరాన్‌ అణు పరీక్షలు నిర్వహించిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు.  కేవలం పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు జరపడం అసాధ్యమని తేల్చేశారు.

ఇరాన్‌ భూకంపాల జోన్‌లోనే ఉంది. సాధారణంగా ఏడాదిలో అక్కడ 2,100 సార్లు భూమి కంపిస్తుంటుంది. ఇందులో 15 నుంచి 16 సార్లు.. రిక్టర్‌ స్కేల్‌పై 5 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూమి కంపిస్తుంది. 2006-2015 మధ్య ఇరాన్‌ 96,000 భూకంపాలను చవిచూసింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)