Breaking News

పాపం..! డ్యాన్స్‌ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష

Published on Wed, 02/01/2023 - 14:46

ఇరాన్‌లో హిజాబ్‌ విషయమై ప్రజలపై కఠిన ఆంక్షలను విధిస్తూ కట్టడి చేస్తున​ సంగతి విదితమే. ఐతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్‌ అయిన ఒక జంట సరదాగా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌ చేశారు. అంతే వారిపై పలు కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించింది ఇరాన్‌ ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే.. 21 ఏళ్ల అస్తియాజ్‌ హకికీ, ఆమెకు కాబోయే భర్త మొహమ్మద్‌ అహ్మదీ టెహ్రాన్‌లోని ఆజాది టవర్‌ వద్ద డ్యాన్స్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది.

దీంతో ఇరాన్‌ పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు వారిపై వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు, అవినీతి వంటి తదితర అభియోగాలు మోపారు. దీంతో వారికి ఆయా నేరాలన్నింటికీ కలిపి సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఐతే ఒక్కొక్క అభియోగంలో వారు దోషులుగా తేలినట్లయితే ఇంకెంత శిక్ష పడుతుందనేది చెప్పలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పాపం ఆ జంటకు ఇన్‌స్టాగ్రామ్‌ వేలాది ఫాలోవర్స్‌ ఉన్నారు. పైగా ఇరాన్‌ నిరసనలను లింక్‌ చేస్తూ కూడా వారు డ్యాన్స్‌లు చేయలేదు.

కానీ ఇరాన్‌ ప్రజలను కర్కశంగా అణచివేసే పనిలో భాగంగా ఆ జంటపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి కటకటాలపాటు చేసింది సర్కార్‌. ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదీగాక 21 ఏళ్ల మహ్సా అమినీ హిజాబ్‌ చట్టాలను ఉల్లంఘించిందంటూ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తదనంతరం ఆమె కస్టడీలో మృతి చెందడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. దీంతో మానవహక్కుల కార్యకర్తలు, ప్రజలు, పెద్ద సంఖ్యలో యువత బహిరంగ నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకింది.

(చదవండి: సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్‌! చివరికి శ్రీలంకలానే..)

#

Tags : 1

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)