Breaking News

వెల్లివిరిసిన యోగా ఉత్సాహం

Published on Sun, 06/22/2025 - 05:15

న్యూయార్క్‌/బీజింగ్‌/ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. రకరకాల యోగాసనాలు ఆచరించిన ఔత్సాహికులతో ప్రధాన నగరాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. పార్కులు, మైదానాలు కిక్కిరిసిపోయాయి. ఎటుచూసినా యోగాభ్యాసకులే కనిపించారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో రచయిత, ఆరోగ్య నిపణుడు దీపక్‌ చోప్రా నేతృత్వంలో యోగా వేడుకలు జరిగాయి. 1,200 మందికిపైగా దౌత్యవేత్తలు, అధి కారులు, ప్రవాస భారతీయులు, అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

న్యూయార్క్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద యోగాసనాలు వేశారు. యునైటె డ్‌ కింగ్‌డమ్, చైనా, సింగపూర్, నేపాల్, జపాన్, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు.  

కులమతాలతో సంబంధం లేదు: ముర్ము  
భారత్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగాభ్యాసకులు ఉత్సాహం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యోగాసనాలు వేశారు. యోగాకు కుల మతాలు, జాతులతో సంబంధం లేదని ఆమె చెప్పారు. భారతీయ శక్తికి యోగా ఒక ప్రతీక అని వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక సాధనంగా తోడ్పడుతుందని సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యగానికి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

 

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)