Breaking News

International Jaguar Day: జాగ్వార్‌ కనుమరుగు?

Published on Sat, 11/29/2025 - 09:20

ఆధునిక మానవుడు తన అవసరాల కోసం అడవులను నరికేస్తున్నాడు. ఫలితంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. ఈ నేపధ్యంలో అటవీ జంతుజాతులు కూడా అంతరించిపోతున్నాయి. ఈ కోవలోకే వస్తుంది జాగ్వార్‌. మనం మచ్చల చిరుతపులిగా పిలుచుకునే జాగ్వార్ కనుమరుగు కావడానికి ఎంతో కాలం లేదని‌ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాగ్వార్‌ల సంరక్షణ కాంక్షను తెలియజేస్తూ, ప్రతీయేటా నవంబర్ 29న అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

శక్తి , జ్ఞానానికి ప్రతీక
ప్రపంచవ్యాప్తంగా జాగ్వార్‌ల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వాటి పాత్రను వివరించేందుకు జాగ్వార్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇవి మధ్య, దక్షిణ అమెరికాలోని అడవులలో నివసించే మాంసాహార జంతువులు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజాలలో జాగ్వార్‌లను బలం, శక్తి , జ్ఞానాలకు సూచికగా భావిస్తారు. వీటికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ జంతువులు ఇప్పుడు మనుగడ కోసం పలు అవస్థలను ఎదుర్కొంటున్నాయి.

అంతరించిపోతున్న జాతులు
పలు నివేదికల ప్రకారం 1970ల నుండి జాగ్వార్‌లు అంతరించిపోతున్న జాతులు కోవలోకి చేరాయి. వేట, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులతో పాటు వాటి ఆవాస నష్టం కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా జాగ్వార్‌ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ కీలకమైన అంశాలను పరిష్కరించేందుకు 2018, మార్చిలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జాగ్వార్ 2030 ఫోరమ్ నిర్వహించారు. ఈ ఫోరమ్‌లో 14 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

జాగ్వార్ 2030 డిక్లరేషన్
ఈ ఫోరమ్‌లో ప్రధానమైనది జాగ్వార్ 2030 డిక్లరేషన్. దీనిలో అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని నిర్వహించాలనే సూచనతో పాటు జాగ్వార్ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన సహకార చర్యలను వివరించారు. జాగ్వార్‌ను జీవవైవిధ్యానికి చిహ్నంగా స్వీకరించిన దేశాలలో బ్రెజిల్ కూడా ఉంది. ఈ దేశంలో జాతీయ జాగ్వార్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. గత 15 ఏళ్లలో 20 శాతం జాగ్వార్‌లను కోల్పోయాం. అనధికారికంగా జగ్వార్‌ జనాభాకు మరింత నష్టం జరిగి ఉంటుందనే అంచనాలున్నాయి. అందుకే వీటిని తక్షణం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

పర్యావరణ సమతుల్యతలో..
ప్రపంచ వన్యప్రాణి సమాఖ్య (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) 2020లో  ప్రాంతీయ జాగ్వార్ వ్యూహాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం 2030 నాటికి జాగ్వార్‌ల సంఖ్యను పెంచడం.  వాటి కీలక ఆవాసాలను పరిరక్షించడం. అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవం అనేది వాటి ఆవాస నష్టం, వేటాడటం, వన్యప్రాణుల సంఘర్షణల కారణంగా ఏర్పడుతున్న ముప్పును ప్రపంచానికి తెలియజేస్తుంది. తద్వారా వాటి పరిరక్షణ అవసరాన్ని తెలియజేస్తుంది. ఈ మాంసాహార జంతువులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

భారతదేశంలో.. 
జాగ్వార్‌లు ఇతర జాతుల మాదిరిగానే  స్థిరమైన పర్యావరణ వ్యవస్థలను కాపాడేందుకు పాటుపడతాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్‌) ఇటీవల జాగ్వార్‌లను ‘పొంచివున్న ముప్పు’ వర్గంలోకి చేర్చింది.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 64,000 జాగ్వార్‌లు మధ్య,దక్షిణ అమెరికా అంతటా విస్తరించి ఉన్న అడవులలోనే ఉన్నట్లు అంచనా. అయితే భారతదేశంలో జాగ్వార్‌లు .. ఆవాస నష్టం, వేట కారణంగా  అంతరించిపోయాయని చెబుతున్నారు. మచ్చల చిరుతపులి (జాగ్వార్) అనేది గంభీరంగా కనిపించే జంతువు మాత్రమే కాదు. అవి జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ముందున్నాయి.  ఇవి తమ వేట ద్వారా జంతు జనాభాను నియంత్రించి, తద్వారా పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు కాపాడేందుకు దోహదం చేస్తాయి. అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవాన ఈ జంతువుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ల నిర్వహణకు రూ.8000 కోట్లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)