Breaking News

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!

Published on Tue, 12/09/2025 - 15:56

ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.

సెంట్రల్‌ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. 

ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్‌ ప్రసారం చేస్తున్న విజువల్స్‌లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్‌లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్‌ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్‌ కూడా వైరల్‌ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్‌ పైన నిల్చున్న​ దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.

ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్‌ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)