Breaking News

పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?

Published on Fri, 05/09/2025 - 09:52

ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్‌ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.

పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్‌ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్‌ సమర్పించిన సంగతి తెలిసిందే.

కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.

ఇలాంటి చర్యలతో పాకిస్తాన్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్‌ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్‌ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్‌ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్‌ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.


 

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)