Breaking News

Russia: ఉక్రెయిన్‌ దాడుల్లో భారత యువకుడి మృతి

Published on Sun, 02/25/2024 - 11:58

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్‌గా పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన హేమిల్‌ అశ్విన్‌భాయ్‌(23) ఈ నెల 21న ఉక్రెయిన్‌ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు.  రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దులోని డొనెస్క్‌ ప్రాంతంలో హేమిల్‌ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్‌ దాడులు జరిగాయని భారత్‌కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్‌ సమీర్‌ అహ్మద్‌ తెలిపారు.

అయితే హేమిల్‌ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్‌తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్‌ ఉక్రెయిన్‌ దాడుల్లో మరణించాడు.

గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్‌, అసదుద్దీనన్‌ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. .  

ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్‌ దాడి

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)