బంగ్లాలో అల్లర్ల ఎఫెక్ట్‌.. భారత్‌ కీలక నిర్ణయం

Published on Thu, 08/08/2024 - 15:01

ఢాకా: భారత్‌ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లడంతో శాంతి భద్రతలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో భారత్‌ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు.

వివరాల ప్రకారం.. బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్న సందర్భంగా అనేక మంది పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు భారత్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఓ మెసేజ్‌ను పెట్టారు. ఈ క్రమంలో..‘బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నాం. అస్థిర పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమిస్తాం అని తెలిపారు. ఇక, భారత్‌కు ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్‌, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్‌హెట్‌ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి.

 

ఇదిలా ఉండగా.. భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి ఇప్పటికే పలువురు మన దేశంలోకి వచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ, బీఎస్‌ఎఫ్‌ దళాలు వారిని అడ్డగించినట్టు సమాచారం. మరోవైపు.. ఒడిశా తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పటిష్ట నిఘాను ఏర్పాటుచేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)