Breaking News

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను: వివేక్ రామస్వామి

Published on Sat, 08/19/2023 - 11:37

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. 

సీఎన్ఎన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపగలను.. అందుకు రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు.

ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా చైనా భాగస్వామ్యాన్ని వేరుచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 

కానీ అది సాధ్యపడాలంటే మనం మొదటిగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముంది. లేదంటే 1972లో నిక్సన్ చైనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. నా దృష్టికి  పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తుంతయారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి రష్యాను చైనా బిగి కౌగిలి నుండి విడిపిస్తానని అన్నారు. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రధానమైనదని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్‌' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)