Breaking News

అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

Published on Sat, 08/17/2024 - 17:16

అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్‌ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి వచ్చిన మైనర్‌ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్‌ పటేల్‌పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్‌ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోంకు తరలించారు. 

‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించాం. స్టోర్‌లో  కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్‌లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ  చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని  రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్‌డానియల్ తెలిపారు.  సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు. 

అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్‌.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, 5 ఏళ్ల  కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్‌ షాప్‌ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)