Breaking News

ఐఎస్‌ఎస్‌కు భారతీయ సంతతి వ్యోమగామి.. ఎవరీ అనిల్‌ మీనన్‌?

Published on Wed, 07/15/2026 - 05:19

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ సోయుజ్‌ఎంఎస్‌–29 అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు పయనమయ్యారు. అనిల్, రష్యా వ్యోమగాములు ప్యోత్స్‌ డుబ్రోవ్, అన్నా కికినాలతో రాస్‌కాస్మోస్‌ అంతరిక్ష నౌక కజఖ్‌స్తాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి మంగళవారం రాత్రి 8.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 

సోయుజ్‌ఎంఎస్‌–29 అర్ధరాత్రి 11.56 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమవుతుంది. అనిల్‌ మీనన్‌కు ఇది మొట్టమొదటి అంతరిక్ష యాత్రకాగా, రష్యా వ్యోమగాములకిది రెండో పర్యటన అని నాసా తెలిపింది. వీరికి బైకనూర్‌లో అనిల్‌ భార్య అన్నా విల్హెల్మ్‌ ఇతర కుటుంబసభ్యులు, నాసా ఉన్నతాధికారి జేర్డ్‌ ఇసాక్‌మన్‌ వీడ్కోలు పలికారు.

మీనన్, డుబ్రోవ్, కికినాలు 8 నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపి వస్తారు. ఈ సమయంలో మీనన్‌ అంతరిక్ష అన్వేషణ, మానవ జీవితానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతారని నాసా తెలిపింది.

ఎవరీ అనిల్‌ మీనన్‌?
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన శంకరన్ మీనన్ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోను ఆయ‌న‌ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమైన అనిల్‌ మిన్నియాపోలిస్‌లో జన్మించాడు. అనిల్ మీనన్.. న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్‌, వైద్య రంగాలలో డిగ్రీలు పూర్తి చేశారు. 

ఆయన హెల్త్‌కేర్, అంతరిక్ష పరిశోధన రంగాలను అనుసంధానిస్తూ  తన కెరీర్‌ను అద్భుతంగా మలచుకున్నాడు. అనిల్ మీనన్ ప్రస్తుతం యూఎస్ స్పేస్ ఫోర్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్‌, కల్నల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అంతకుముందు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో అఫ్గనిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్‌లో ఫ్రంట్‌లైన్ సేవలందించారు. సరిహద్దుల్లోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకుల ప్రాణాలు కాపాడేందుకు 'హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్' తరపున కూడా అనిల్ ప‌నిచేశారు. అదేవిధంగా రోటరీ అంబాసిడరియల్ స్కాలర్‌గా ఆయ‌న భార‌త్‌లో ఏడాది పాటు గ‌డిపారు.

నాసా టూ స్పేస్‌ఎక్స్
అనిల్ అంతరిక్ష ప్రయాణం 2014లో నాసాతో ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉండే వ్యోమగాముల ఆరోగ్య బాగోగులు చూసుకునే 'ఫ్లైట్ సర్జన్'గా నాసాలో కెరీర్ ప్రారంభించారు. ఆ త‌ర్వాత 2018లో ఎలోన్ మాస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) లో అనిల్ చేరారు.  

చంద్రుడు, అంగారకుడి పైకి ప్రయోగించబోయే 'స్టార్‌షిప్' అభివృద్ధిలో అనిల్ మీనన్ కీలకంగా వ్యవహరించారు. అయితే డిసెంబర్ 2021లో నాసా అనిల్‌ను అధికారికంగా వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు. కాగా ఆయన భార్య అన్నా విల్హెల్మ్ కూడా ఒక వ్యోమగామి కావడం గమనార్హం. 2024లో స్పేస్‌ఎక్స్ నిర్వహించిన ఒక ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్ ద్వారా ఆమె  దాదాపు ఐదు రోజుల పాటు అంతరిక్షంలోకి ప్రయాణించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)