కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత

Published on Mon, 01/13/2025 - 04:49

ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిత.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రధానిగా, పార్టీ అధినేతగా జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేయడంతో ఆమె బరిలోకి వచ్చారు. అయితే.. వారంలోపే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా లిబరల్‌ బృందానికి, ఓక్‌విల్లే ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్‌ జట్టులోకి నన్ను ఆహ్వానించినందుకు, కీలకమైన కేబినెట్‌ శాఖలను అప్పగించినందుకు ప్రధాని ట్రూడోకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత ఇరవై సంవత్సరాలుగా నా భర్త, నేను మా నలుగురు పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్‌విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని’’ అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్‌విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని, అయినప్పటికీ  ఒక్కసారి కాదు రెండుసార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని చెప్పారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)