Breaking News

లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్‌

Published on Sun, 12/14/2025 - 12:46

మెహసానా : గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో పాటు పోర్చుగల్‌కు వలస వెళ్లే ప్రయత్నంలో లిబియాలో కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిని కిస్మత్‌సింగ్ చావ్డా, అతని భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షిగా గుర్తించారు. కిస్మత్‌సింగ్ సోదరుడు నివసిస్తున్న పోర్చుగల్‌లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో వీరు నవంబర్ 29న అహ్మదాబాద్ నుండి బయలుదేరారు. వీరు దుబాయ్ మీదుగా లిబియాలోని బెన్‌ఘాజీ నగరానికి విమానంలో చేరుకోవలసి ఉంది.  అయితే ఇంతలోనే బెన్‌ఘాజీలో కిడ్నాప్‌కు గురయ్యారు.

ఈ కుటుంబం పోర్చుగల్ కేంద్రంగా పనిచేసే ఒక విదేశీ ఏజెంట్ సహాయంతో ఈ ప్రయాణం చేస్తున్నట్లు మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపారు. కిడ్నాపర్‌లు మెహసానాలోని చావ్డా బంధువులను సంప్రదించి, వారిని విడుదల చేయడానికి రూ. రెండు కోట్లు డిమాండ్‌ చేశారు.ఈ సమాచారం అందుకున్న బంధువులు.. సహాయం కోసం మెహసానా జిల్లా కలెక్టర్ ఎస్‌కే ప్రజాపతిని ఆశ్రయించారు.

ఈ కిడ్నాప్ ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఏజెంట్లు ఎవరూ భారతీయులు కాదని సోలంకి ధృవీకరించారు. దీనిలో అంతర్జాతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చన్నారు. కాగా ఇదే తరహాలో గత జూలైలో జమ్ముకశ్మీర్‌కు చెందిన రంజిత్ సింగ్ .. నైజర్‌లోని డోస్సో ప్రాంతంలో కిడ్నాప్‌కు గురయ్యారు.

ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్‌’.. ఎక్కడకి? ఎందుకు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)