Breaking News

ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్‌ హతం: వీడియో వైరల్‌

Published on Tue, 05/16/2023 - 16:16

డ్యూటీలోని ఓ పోలీసు చేతిలో భారతీయ ఫైనాన్షియల్‌ బ్యాంకర్‌ హతమయ్యాడు. అతను తన రుణం విషయమై సదరు బ్యాంకర్‌తో వాదించి మరీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాల నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మే 12న ఉత్తమ్‌ భండారీ అనే ఫైనాన్షియల్‌ బ్యాంకర్‌పై 30 ఏళ​ ఇవాన్‌ వాబ్‌వైర్‌ కాల్పులు జరిపాడు. నిజానికి భండారీ టీఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వాబ్‌వైర్‌ అతడి క్లయింట్‌. వాబ్‌వైర్‌ సంస్థ నుంచి మొత్తం రూ. 46 వేలు లోన్‌(రుణం) తీసుకున్నాడు.

ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో వాబ్‌వైర్‌ ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భండారీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో పోలీసులు వాబ్‌వైర్‌ డ్యూటీలో లేని ఓ పోలీసుగా పేర్కొన్నారు. తన సహచర ఉద్యోగి నుంచి ఏకే 47ని దొంగలించి మరీ అతడిపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు.

వాబ్‌వైర్‌ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, అందుకోసం రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న చరిత్ర కూడా ఉందని చెప్పారు. అతను ఈ విషయమై ఐదేళ్ల వరకు తుపాకిని కలిగి ఉండకుండా నిషేధించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఉగాండాలో ఈ విషయమై ఆందోళన చెందుతున్న భారతీయ కమ్యూనిటీలను కలుసుకుని వారి భద్రత విషయమై హామి ఇచ్చారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్‌ అవుతోంది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

(చదవండి: మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)