Breaking News

వివేక్‌ రామస్వామిలో ఈ టాలెంట్‌ కూడా!

Published on Tue, 08/29/2023 - 11:28

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ తరపున ఆశావహుడు, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి Vivek Ramaswamy తనలోని టాలెంట్‌ను ప్రదర్శించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ర్యాప్‌ కట్టి అల్లాడించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అడ్డు కూడా తగిలింది.

భారత మూలాలున్న వివేక్‌ రామస్వామి Vivek Ramaswamy అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల(రిపబ్లికన్‌ పార్టీ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రామస్వామి ‘డా వెక్‌ ది ర్యాపర్‌’గా గుర్తింపు పొందాడట కూడా.  అందుకే ఆ టాలెంట్‌ను ప్రదర్శించారు. లోవా స్టేట్‌ ఫెయిర్‌కు హాజరై.. ప్రముఖ ర్యాప్‌ స్టార్‌ ఎమినెమ్‌ ‘లాస్‌ యువర్‌సెల్ఫ్‌’ ర్యాప్‌ను తన గొంతుతో కట్టి అక్కడున్నవాళ్లను అలరించారాయన. అయితే.. 

ఈ పరిణామం జనాలను అలరించినా.. ఎమినెమ్‌(50)కు నచ్చలేదు. తన మ్యూజిక్‌ను ఎక్కడా వాడొద్దంటూ సున్నితంగానే రామస్వామికి తెలియజేశారు. ఈ మేరకు మ్యూజిక్‌సంస్థ తరపున ఓ లేఖను రామస్వామికి పంపించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో తన మ్యూజిక్‌ను వాడొద్దని లేఖలో  ఎమినెమ్‌, రామస్వామికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఇలా తమ మ్యూజిక్‌ వాడొద్దంటూ కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రెండు దఫా ఎన్నికల్లో.. రిహానా, అడెలె మ్యూజిక్‌లను ట్రంప్‌ తన ర్యాలీలలో అనుమతులు లేకుండానే ఉపయోగించారు. 

38 ఏళ్ల వివేక్‌ రంగస్వామి తనను తాను ‘ట్రంప్‌ 2.0’గా భావిస్తున్నారు. అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరపున నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు వివేక్‌. అంతేకాదు.. తానే గనుక అధ్యక్షుడ్ని అయితే ఎలన్‌ మస్క్‌ని వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)