Breaking News

వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్‌: ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌ అభినందనలు

Published on Tue, 07/01/2025 - 07:34

వాషింగ్టన్‌ సీడీసీ: భారత ప్రధాని మోదీ తరచూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ, ఆయా దేశాలతో భారత్‌ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుంటారు. అలాగే వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు. ఈ నేపధ్యంలో ఆయా దేశాల అధిపతుల అభినందనలు అందుకుంటుంటారు.  ప్రధాని మోదీ తాజాగా అమెరికా నుంచి అభినందనలు అందుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని మోదీతో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. శ్వేతసౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో  ఆమె మాట్లాడుతూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మిత్రదేశంగా భారతదేశం నిర్వహిస్తున్న పాత్రను ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య బలమైన సంబంధం ఉందని కూడా  అన్నారు.

భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. గత వారమే భారత్‌- అమెరికా  మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ విషయమై తాను అమెరికా వాణిజ్య కార్యదర్శితో మాట్లాడానని, ఆయన అధ్యక్షుడు ట్రంప్‌తో ఇదేవిషమై సమాలోచనలు జరుపుతున్నారన్నారు. ఈ ఒప్పందాలను ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే అమెరికా వాణిజ్య బృందం దీనికి సంబంధించిన ప్రకటన వెలువరుస్తుందన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా  విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న తరుణంలో అమెరికా ఈ వివరాలు తెలిపింది.

ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ‘క్వాడ్‌’(క్యూయూఏడీ) సదస్సులో పాల్గొన్న జైశంకర్‌ తొలుత ‘ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ అనే ప్రదర్శనను ప్రారంభించారు. ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఆవశ్యతను ప్రపంచదేశాలకు తెలియజేసే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. క్వాడ్‌ అనేది ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్ , యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన దౌత్య భాగస్వామ్యం. ఇది ఇండో-పసిఫిక్‌కు మద్దతు పలికేందుకు ఉద్దేశించినది. ఈ గ్రూపు 2004 డిసెంబరులో సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో ఈ దేశాలు పరస్పరం మానవతా దృక్ఫధాన్ని చాటేందుకు ఏర్పాటయ్యింది.

ఇది కూడా చదవండి: భారత్‌-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)