Breaking News

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంపై భారత్‌ ఆందోళన చెందుతోంది: జై శంకర్‌

Published on Wed, 10/02/2024 - 13:38

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్‌ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.

ఈనేపథ్యంలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్‌ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్‌, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.
చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..

ఈ మేరకు యూఎస్‌ వాషింగ్టన్‌లోని థింక్‌ తాంక్‌ కార్నేగీ ఎండోమెంట్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.  అది ఎంతో ముఖమన్న జై శంకర్‌.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లు

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్‌ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ క్షిపణుల ప్రయోగం మొదలైంది.  ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)