Breaking News

ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్‌ కీలక ఒప్పందం

Published on Tue, 10/15/2024 - 14:31

దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్‌ డ్రోన్‌ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. 

వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్‌ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్‌ఆర్‌ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్‌ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్‌ డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం  క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.

కాగా డెలావేర్‌లో జరిగిన క్వాడ్‌ లీడర్స్‌ సదస్సు సందర్భంగా డ్రోన్‌ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్‌ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్‌బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించనుంది.

అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్‌ భావిస్తోంది. ఈ డ్రోన్‌లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి.  సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్‌ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్‌ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్‌ అటామిక్స్‌ నుంచి లీజ్‌పై భారత్‌ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)