Breaking News

‘సమితి’లో పాక్‌ బండారం బయటపెట్టిన భారత్‌

Published on Wed, 07/23/2025 - 09:24

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ తీరుతెన్నులను భారత్‌ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్  ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్‌ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.

భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్‌ పేర్కొన్నారు. అనంతరం భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)