Breaking News

పీఓకేలో పాక్ బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్ పర్యటన.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

Published on Sat, 01/13/2024 - 19:54

‘పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిట‌న్ రాయబారి ప‌ర్య‌టించడంపై భార‌త్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్‌ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది.

కాగా పాకిస్థాన్‌లోని బ్రిటన్‌ హైకమిషనర్‌ జేన్‌ మారియట్‌ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్‌ను సందర్శించారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫోటోలు, వీడియోల‌ను `ఎక్స్‌`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ జాన్ మారియ‌ట్ పీవోకేలో ప‌ర్య‌టించ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నట్లు పేర్కొంది.

కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్‌ అధ్యక్షుడు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)