Breaking News

చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

Published on Sat, 06/20/2026 - 14:33

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్‌పో (Yarlung Tsangpo)నది దిగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్ట నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. దీంతో  భారతదేశం డ్రాగన్‌ కంట్రీకి గట్టి కౌంటర్‌ ఇస్తోంది.  చైనా టిబెట్ పరిధిలో బ్రహ్మపుత్ర  నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌కు కౌంటర్‌గా భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ. 1.5 లక్షల కోట్ల వ్యయంతో 11,000 మెగావాట్ల సామర్థ్యంతో మెగా  జలవిద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.  

ప్రభుత్వరంగ సంస్థ NHPC ఆధ్వర్యంలోప్రత్యేకంగా నిర్మించనున్న 'సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్' (SUMP) భారత దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్‌గా నిలువనుందని అంచనా. ఇది ఏటా 47 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా సృష్టించ బోయే కృత్రిమ వరదలు, నీటి కొరత ముప్పును ఎదుర్కొని, ఈశాన్య రాష్ట్రాల జల భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ ద్వంద్వ ప్రయోజనం, ఇటు ఆర్థిక విలువతో పాటు అటు భౌగోళిక-రాజకీయ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.

దీని రిజర్వాయర్ దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచేలా సుమారు 300 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఎగువన చైనా ఒకవేళ నీటిని అకస్మాత్తుగా వదిలినా లేదా ఆపివేసినా, ఈ రిజర్వాయర్ ఒక నియంత్రణ అవరోధంగా మారి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం పరివాహక ప్రాంతాలలో వరదలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

వివాదాస్పద నదిపై చైనాప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే, భారతదేశం ఇప్పుడు తన వ్యూహాత్మక ప్రతిస్పందనను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. లోక్‌సభకు ఇచ్చిన అధికారిక లిఖితపూర్వక సమాధానంలో, జలవిద్యుత్ వినియోగం కోసం చైనా ప్రణాళికలతో సహా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్రం ధృవీకరించింది. అలాగే, దిగువ ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటానికి అవసరమైన నివారణ, సవరణ చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌

అయితే ప్రపంచంలోనే పెద్దదైన చైనా 60వేల మెగావాట్ల మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పటికే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ఉండగా, SUMP నిర్మాణ పూర్వ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రీ-ఫీజిబిలిటీ (ప్రారంభ పరిశీలన) దశలో ఉంది. భారత్‌తో పోలిస్తే చైనా ప్రాజెక్ట్‌ సామర్థ్యం చాలా రెట్లు మించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. 

ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)