Breaking News

ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం

Published on Tue, 06/03/2025 - 05:13

న్యూఢిల్లీ: కొత్తగా తయారుచేసి భారత్‌కు ఇవ్వాల్సిన ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థ(సుదర్శన చక్ర)లను 2025–2026 షెడ్యూల్‌ ప్రకారం అందజేస్తామని రష్యా స్పష్టంచేసింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పైకి భారత్‌ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటు నుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం తెల్సిందే. 

దీంతో ఒప్పందం ప్రకారం మిగతా ఎస్‌–400 యూనిట్లనూ త్వరగా తయారుచేసి సరఫరాచేయాలని భారత్‌ ఇటీవల రష్యాను కోరింది. దీనిపై రష్యా డెప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఇన్‌ ఇండియా రోమన్‌ బబూష్కిన్‌ సోమవారం స్పందించారు. ‘‘భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యల్లో ఎస్‌–400 అద్భుత పాటవాన్ని ప్రదర్శించిందని మేం కూడా విన్నాం. భారత్‌తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది.

 ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్‌ మాత్రమేకాదు భారత్‌లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరో రెండు యూనిట్లను భారత్‌కు అందించాల్సి ఉంది. వాటిని షెడ్యూల్‌ ప్రకారం తయారుచేసి డెలివరీ ఇస్తాం’’అని బబూష్కిన్‌ అన్నారు. 2018లోనే రష్యాతో భారత్‌ రూ.46,000 కోట్లతో ఎయిర్‌ డిఫెన్స్‌ డీల్‌ కుదుర్చుకోవడం తెల్సిందే. ఇందులోభాగంగా ఐదు స్క్వాడ్రాన్‌ల ఎస్‌–400 యూనిట్లను రష్యా తయారుచేసి భారత్‌కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ మరికొద్ది వారాల్లో ఖరారుకానుంది.  
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)