Breaking News

షేక్‌ హసీనాను భారత్‌ అప్పగిస్తుందా?లేదా?: బంగ్లాదేశ్‌

Published on Mon, 09/02/2024 - 15:30

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్‌ నుంచి లండన్ వెళ్లి అక్కడే ఆశ్రయం పొందాలని భావించిన ఆమెకు.. అక్కడి నుంచి అనుమతి రాకపోవడంతో.. ఇక్కడే చిక్కుకుపోయారు.

ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. భారత ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా మరోసారి షేక్‌ హసీనా అప్పగింతపై స్పందించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. హసీనాను స్వదేశానికి తిరిగి రప్పించడానికి యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు.

హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. షేక్‌ హసీనాను భారత్‌ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా ఆయన ప్రశ్నించారు. ఆమెను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొన్నారు.

తమ న్యాయ వ్యవస్థ కోరుకుంటే ఖచ్చితంగా ఆమెను తిరిగి బంగ్లాకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ మేరకు భారత్‌తో తమకు వివిధ ఒప్పందం, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని, దీనిపై ఊహాగానాలు చేయకపోవడమే మంచిదని అన్నారు.

అయితే హసీనా అసలు భారత్‌లో ఎక్కడ ఉన్నారనే విషయం తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అనే మీడియా ప్రశ్నించగా.. తౌహిద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ..  ఈ విషయం గురించి భారత్‌ను అడగండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హసీనాతోపాటు ఆమె బంధువుల దౌత్య పాస్‌పోర్ట్‌లను బంగ్లాదేశ్ రద్దు చేసింది. ఈ క్రమంలో షేక్‌ హసీనా ఇకపై భారత్‌లో ఉండగలదా? లేక ఆమెను బంగ్లాకు అప్పగించనుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆగష్టు 5న  ఆమె దేశం వదిలి పారిపోయి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)