Breaking News

ఇజ్రాయిల్‌తో లక్షల కోట్ల బిగ్‌డీల్..!

Published on Mon, 02/23/2026 - 16:42

ప్రధాని  మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ కీలక ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్ రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ, డ్రోన్లు ఇతరాత్ర ఆధునాతన ఆయుధాలకై దాదాపు 93.5 బిలియన్ డాలర్లతో ఇజ్రాయెల్‌తో భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్‌తో జరిగే అతిపెద్ద డీల్‌గా ఇది చరిత్రకెక్కనుంది.

ఇజ్రాయెల్  దేశం సాంకేతికత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విస్తీర్ణంపరంగా చిన్న దేశమైనా తన ఆధునాతన సాంకేతికతో అత్యాధునికి డ్రోన్లు, రక్షణవ్యవస్థ ఇలా ఎంతో మెరుగైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరొందింది. అయితే ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 న ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

భారత్, ఇజ్రాయెల్‌తో 93.5 బిలియన్‌ డాలర్లతో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు ఇతరాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేశ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణపరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.

అయితే ఇజ్రాయెల సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా  తన అత్యంత రహస్యమైన, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్‌తో పంచుకోవడానికి అంగీకరించంది. గత నవంబర్‌లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి. 

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిషన్ సుదర్శన్'లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం.

  
 

#

Tags : 1

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు